- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘అఖండ 2’ సెట్స్‌లో అడుగు పెట్టిన బాలయ్య.. పద్మ భూషణుడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మూవీ టీమ్..(వీడియో)

దిశ, సినిమా: పద్మ భూషణుడు, నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా రీసెంట్‌గా ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ) సినిమాతో మనముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) తెరకెక్కించిన ఈ మూవీలో.. ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(shraddha Srinath) హీరోయిన్లుగా నటించగా.. ఊర్వశి రౌతేలా(urvasi Rautela) ఐటెం సాంగ్‌లో చిందులేసింది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబు ‘అఖండ-2’(Akhanda-2) లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2021లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ , బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి ‘అఖండ’(Akhanda) సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ-2’ తెరకెక్కుతుండగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(Samyuktha Menon), ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాని బాలయ్య రెండో కూతురు తేజస్విని(Tejaswini) సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట(Ram Achanta), గోపీ ఆచంట(Gopi Achanta)లు తెరకెక్కిస్తున్నారు.
కాగా ఇక ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ‘అఖండ- 2’ దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అఖండ 2 సెట్స్‌లోకి బాలకృష్ణ అడుగుపెట్టారు. ఇప్పటికే ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbhamela)లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ షూట్ చేయగా.. సోమవారం నుంచి ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది.
ఇందులో భాగంగా బాలకృష్ణ నిన్నటి నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే బాలయ్యకు ఇటీవలే పద్మభూషణ్ అవార్డు(Padma Bhushan Award) ప్రకటించిన సంగతి తెలిసిందే. పద్మభూషణ్ వచ్చాక సెట్స్‌లో అడుగుపెట్టడంతో మూవీ యూనిట్ పూలు జల్లి బాలయ్యకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అలాగే అతనితో కేక్ కట్ చేయించారు. మూవీ యూనిట్ అంతా బాలయ్యకు అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇక తాజాగా అఖండ 2 సెట్స్‌లో జరుపుకున్న సెలబ్రేషన్స్ వీడియోని రిలీజ్ చేశారు మూవీ యూనిట్. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.