Murder : 18 ఏళ్ల క్రితం హత్య.. తల్లిదండ్రులకు పుర్రె అప్పగింత

by Sathputhe Rajesh |   ( Updated:2024-11-12 19:33:40.0  )
Murder : 18 ఏళ్ల క్రితం హత్య.. తల్లిదండ్రులకు పుర్రె అప్పగింత
X

దిశ, నేషనల్ బ్యూరో : 18 ఏళ్ల క్రితం గోవాలో హత్యకు గురైన తమ కుమార్తె పుర్రెను చూసి ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. కసర్‌గోడ్ కోర్టు మంగళవారం పుర్రె ఉన్న బాక్స్‌ను ఆ కుటుంబానికి అప్పగించింది. 13 ఏళ్ల సోఫియా 2006 డిసెంబర్‌లో కాసర్ గోడ్‌కు చెందిన కాంట్రాక్టర్ కేసీ హంసా ఇంట్లో పనిమనిషిగా చేరింది. అయితే ఆ సమయంలోనే హత్యకు గురైంది. బాలికకు హంసా వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేయగా.. కేసు పెడితే శిక్ష పడతుందని భావించి బాలికను దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీరాన్ని ముక్కలుగా కోసి నిర్మాణంలో ఉన్న డ్యామ్ వద్ద డెడ్ బాడీని పడేశాడు. పోలీసులు మృతదేహాన్ని 2008లో వెలికితీశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా 2015లో మరణశిక్ష పడింది. అనంతరం కేరళ హైకోర్టు మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. అయితే తమ కుమార్తె మృతదేహాన్ని అప్పగించాలని వారి కుటుంబం కోర్టును ఆశ్రయించింది. మంగళవారం కోర్టు బాలిక పుర్రెను కుటుంబసభ్యులకు అప్పగించగా వారు స్వగ్రామానికి తీసుకెళ్లి ఖననం చేశారు.

Advertisement

Next Story