- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ప్రమాదమైనా.. తప్పని ప్రయాణం..
దిశ, గంగాధర : ఆటోల్లో ప్రయాణించడం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తుండడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పొట్ట కూటికోసం పల్లెల్లో వ్యవసాయ కూలీలు ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నారు. పనులకోసం వెల్లె కూలీలను తరలించే వాహనాలు వారి ప్రాణాలే పణంగా పెట్టి రవాణా సాగిస్తున్నారు. పరిమితికి మించి వాహనాల్లో కూలీలను నింపి తరలిస్తున్నారు. ఆటోలలో మినిమం ఐదుగురిని తీసుకెళ్లాల్సి ఉండగా.. పరిమితికి మించి 15 నుండి 20 మందికి తక్కువ కాకుండా తరలిస్తున్నారు. కూలీలకు ప్రమాదం అని తెలిసినా పొట్టకూటి కోసం ప్రయాణం చేయకతప్పడం లేదు. నిబంధనలకు విరుద్దంగా ట్యాక్సి వాహనాలు నడుస్తున్న కట్టడి చేసే అధికారులు కళ్లుమూసుకోవడంతో వాహనదారులు ఇష్టానుసారంగా కూలీలను తరలిస్తుండగా గమ్యం చేరేవరకు కూలీలు బిక్కు బిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు.
వివరాల్లోకి వెలితే కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని వివిధ గ్రామాల నుండి కూలి పనులకు వెళ్లే కూలీలను పరిమితికి మించి ఆటోలు, టాటా ఏసీలు, టాటా మ్యాజిక్లు, గూడ్స్ ఆటోలలో ఇష్టానుసారంగా ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు రక్షణ లేకుండా వారిని తరలిస్తున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిబంధన మేరకు ఆర్టీవో కార్యాలయం నుండి లైసెన్స్ పొందాలి. కానీ కొందరు లైసెన్స్ లేకుండా ఆటోలు , ఇతర ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ నడుపుతున్నందున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం మండల కేంద్రం నుండి వివిధ గ్రామాల నుండి మధ్య దళారులుగా ఉండి ఆటో డ్రైవర్లు కూలీలను తరలిస్తున్నారు. కూలీలు అంతరించినందుకు ఆటో కిరాయితో పాటు కూలీలను తీసుకువచ్చినందుకు రైతులు వారికి అదనంగా పైసలు ముట్ట చెబుతున్నారు.
ప్రయాణం ప్రమాదం..
పరిమితికి మించి ప్రయాణం.. ప్రాణం మీదకు తెస్తోంది. ప్రయాణికులను తరలించే వాహనాలతో పాటు కొన్నిసార్లు గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృతి చెందుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఆటోలు, టాటా ఏస్, టాటా మ్యాజిక్, గూడ్స్ ఆటోల్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నారు. డ్రైవర్ కూర్చొని వాహనం నడిపే వీలులేకుండా ముందర సీట్లో ప్రయాణికులను కూర్చోబెట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒక ఆటోలో నలుగురు ప్రయాణికులు కూర్చోవాలి. కానీ ఆటో డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా అత్యాశతో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు.
గ్రామాల నుంచి కూలీల తరలింపు..
వాహనాల్లో ప్రయాణించే క్రమంలో గ్రామాల నుండి రైతు కూలీలను ఆటోలు, టాటా ఏస్, టాటా మ్యాజిక్, గూడ్స్ ఆటోలలో 15 నుండి 20 మందికి తక్కువ కాకుండా తీసుకొస్తున్నారు. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేసే సమయంలో వారిని చూసే వాహనాలు అక్కడే నిలిపివేస్తున్నారే తప్ప.. ప్రయాణికులను మాత్రం తగ్గించడం లేదు. జరగరానిది ఏదైనా జరిగితే కూలీల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అధికారులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా వాహనదారులు, డ్రైవర్లలో మాత్రం మార్పు రావడం లేదు. ధనార్జనే ధ్యేయంగా కొంత మంది పరిమితికి మించి ప్రయాణికులను తరలించి ప్రాణం మీదకు తీసుకొస్తున్నారు.
నిబంధనలు గాలికి..
వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రయాణికులను తరలించే డ్రైవర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇందులో అతివేగంగా నడపడంతో పాటు పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం నిబంధనలకు విరుద్ధమే. కొంత మందికి లైసెన్సు లేకుండా కూడా వాహనాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు తనఖీ చేసే సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిబంధనల ప్రకారం వాహనాలకు ఉండాల్సిన పత్రాలు ఉంచుకోవడం లేదు. దీంతో డ్రైవర్కు ముందు సీట్లలో ఇరువైపులా కూర్చోబెట్టుకోవడం ద్వారా వాహనం అదుపు చేయలేక బోల్తా పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
పరిమితికి మించితే చర్యలు..గంగాధర ఎస్సై నరేందర్ రెడ్డి..
ఆటోల్లో రైతు కూలీలను, ప్రయాణికులను పరిమితికి మించి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. స్పెషల్ రైడ్ నిర్వహించి ఎం.వి అట్ ప్రకారం చర్య తీసుకుంటామని డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ మాట్లాడడం వల్ల వాహనాలు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. మన ప్రాణాలే కాదు.. మన మీద ఆధారపడిన వారు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకొని డ్రైవర్లు వాహనాలు నడపాలి.