- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చోరీ చేసుల్లో ఇద్దరు నిందితులు అరెస్ట్
దిశ, భైంసా : కుబీర్ మండల కేంద్రంలోని రద్దీగా ఉండే ప్రదేశంలో మంగళవారం సాయంత్రం చోరీకి పాల్పడిన దుండగులు, రాత్రి చోండికి వెళ్తున్న ఒకరిని బెదిరించి సెల్ దొంగిలించిన రెండు కేసులకు సంబంధించి మొత్తం ముగ్గురు నిందితులలో గురువారం ఇద్దరిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. భైంసా పట్టణ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుబీర్ మండల కేంద్రంలోని రద్దీగా ఉండే ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఇస్లాపూర్ కి చెందిన ముగ్గురు నిందితులు మహిళ మెడలో నుంచి చైన్స్ స్నాచింగ్ కి పాల్పడగా మహిళ ప్రతిఘటించడంతో చోరీ విఫలమైంది.
దీంతో దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. అదే విధంగా రాత్రి చోండి గ్రామానికి వెళ్తున్న శ్రీరంగ్ అనే వ్యక్తిని బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి అతని వద్ద సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన పోలీసులు ఇద్దరిని పట్టుకోగా మరొకరి జాడ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. నిందితుల వద్ద మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ, రూరల్ సీఐలు గోపీనాథ్, నైలు, ఎస్సై రవీందర్,హెడ్ కానిస్టేబుల్ జనార్థన్ నాయక్ ,కానిస్టేబుల్ రమణ పాల్గొన్నారు.