- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురోహితుడితో నాగార్జున మంతనాలు..? నాగ చైతన్య, శోభిత పెళ్లి విషయంలో షాకింగ్ ట్విస్ట్..!
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4న జరగనున్నట్లు సమాచారం. ఇక అప్పటి నుంచి వీరికి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా శోభిత, నాగ చైతన్య పెళ్లి విషయంలో ఓ షాకింగ్ ట్విస్ట్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. వివరాల్లోకి వెళితే..
చైతన్య, శోభితల నిశ్చితార్థం జరిగిన నెక్స్ట్ డేనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వీళ్లిద్దరు 2027 వ సంవత్సరంలో విడాకులు తీసుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అక్కినేని అభిమానులు ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అంతే కాకుండా ఫిల్మ్ జర్నలిస్టుల సంఘం మహిళా కమీషన్‌కి ఫిర్యాదు కూడా చేసింది. వేణు స్వామి పై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ కూడా మొదలు పెట్టారు. అయితే శుభమా అని పెళ్లి చేసుకోబోతున్న జంట గురించి ఇలాంటి అశుభమైన మాటలు మాట్లాడితే ఏ తండ్రికైనా కాస్త మనసులో ఎదో ఒక మూల భయం ఉంటుంది. పైగా నాగచైతన్య, సమంత విషయంలో వేణు స్వామి చెప్పింది నిజమైంది.
ఆ భయం అక్కినేని కుటుంబ సభ్యులందరికీ ఉంది. అందుకే నాగార్జున రీసెంట్‌గా ఒక ప్రముఖ జ్యోతిష్యుడి వద్దకు వెళ్లి నాగ చైతన్య, శోభిత జాతకాలు చూపించాడట. వీళ్లిద్దరి జాతకాలు చూసిన తర్వాత చిన్న చిన్న దోషాలు తప్ప, భయపడాల్సిన అవసరం లేదని, ఈ జంట నిండు నూరేళ్లు సంతోషంగా కలిసి జీవిస్తారని చెప్పాడట. దీంతో నాగార్జున మనసు కాస్త కుదుట పడిందట. ఒకవేళ వేణు స్వామి చెప్పినట్టే, ఈ జ్యోతిష్యుడు కూడా చెప్పి ఉండుంటే, వీళ్ళ పెళ్లిని నాగార్జున జరగనిచ్చేవాడా అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.