- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Children's Day: విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి సభ.. ఏం చెప్పనున్నారో తెలుసా?
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తవుతున్న సందర్భంగా గురువారం నుంచి ప్రజా విజయోత్సవాల పేరుతో వేడుకలు నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభమయ్యే వేడుకలు డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు జరగనున్నాయి. ప్రతి రోజు ఒక కార్యక్రమం ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రజా విజయోత్సవాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కార్యక్రమాలను ఖరారు చేసింది. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజైన నవంబర్ 14న ప్రారంభించి సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబర్ 9న కార్యక్రమాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఏ రోజున ఏ శాఖకు చెందిన కార్యక్రమాలను నిర్వహించాలో నిర్ణయించారు. మొదటి రోజు బాలల దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో 14వేల మంది విద్యార్థులతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించనున్నారు.
వరుసగా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ గ్యారంటీ పథకాలైన మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలతోపాటు, ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక అధివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతారు. వ్యవసాయ రుణాల మాఫీ, మహిళా సంఘాలకు 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలపై కార్యక్రమాలు చేపడుతారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 9న హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శన, లేజర్ షో, బాణాసంచా ప్రదర్శన ఏర్పాటు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్- 4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు, వివిధ శాఖలకు సంబందించిన పాలసీ విధానాలను ప్రకటిస్తారు. స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన, 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల కళాశాలల ప్రారంభోత్సవం, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం, పోలీస్ శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, డాగ్ షోలు, పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు ఉంటాయి.
ఘనంగా ప్రారంభ కార్యక్రమం: శాంతి కుమారి
ప్రజాపాలన - ప్రజా విజయోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విద్యా శాఖ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రు జయంతిని పురస్కరించుకొని ఎల్.బీ. స్టేడియంలో మధ్యాహ్నం నిర్వహించే కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. దాదాపు 14 వేల మంది విద్యార్థులు పాల్గొనే ఈ సమావేశంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ అన్నారు.
ప్రధానంగా వివిధ జిల్లాల నుండి వచ్చే వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని, భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. సమీక్షలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, నగర పోలీస్ కమిషనర్ సి.వీ ఆనంద్, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ కమీషనర్ ఇలంబర్తి, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ హరీష్ , హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వెంకట నర్సింహా రెడ్డి తదితర ఉన్నతాధికారులు ఈ టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.