Suman : తిరుమల లడ్డూ వివాదం కల్తీ అంశం మాత్రమే : హీరో సుమన్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-10 07:29:32.0  )
Suman : తిరుమల లడ్డూ వివాదం కల్తీ అంశం మాత్రమే : హీరో సుమన్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదంపై టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్(Hero Suman )స్పందించారు. ఓ టీవీ చానల్ ఇంటర్య్వూలో సుమన్ మాట్లాడుతూ లడ్డూ కల్తీ వేరు.. సనాతన ధర్మం వేరని కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని కల్తీ అంశం(adulterated)గా మాత్రమే చూడాలన్నారు. సనాతన ధర్మం అర్థం తెలియాలంటే గూగుల్ చూడవచ్చని చెప్పారు. దేశంలో హిందువులకు రక్షణ లేదని సుమన్ వ్యాఖ్యానించారు. హిందుత్వంపై దాడి పట్ల ఓ రకంగా, ఇతర మతస్తులపై దాడుల పట్ల ఓ రకంగా స్పందించే వ్యవహారం సాగుతోందన్నారు. అందుకే మతాలను గౌరవించే విషయంలో, రక్షణ కల్పించడంలో పార్లమెంటులో ఓ సమగ్రచట్టం తేవాల్సిన అవసరముందన్నారు. ప్రతివారు ఇతర మతాలను గౌరవించాల్సిందేనన్నారు. నటుడిగా అన్ని మతాల వారు ఆదరిస్తేనే నేను హీరో అయ్యానన్నారు.

గతంలోనూ వెటరన్ హీరో సుమన్ తిరుమల లడ్డూ కల్తీ అంశంపై స్పందించారు. లడ్డూ కల్తీ నిజమని తేలితే దోషుల్ని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన ఇలాంటి అంశంలో చేసిన ఈ నేరం తీవ్రవాదం కంటే ఎక్కువంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసేలా లడ్డూ కల్తీ చేసిన వారిని వదలకూడదని, పార్లమెంటులో ఎన్నో బిల్లులు ఆమోదిస్తుంటారని, ఇలాంటి విషయాల్లో తప్పు చేసినవారిని రెండేళ్లు జైళ్లో వేసేలా ఓ బిల్లు తేవాలన్నారు. ఇక తిరుమలలో డిక్లరేషన్ విషయంపై వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలన్నారు. టీటీడీ బోర్డులో రాజకీయ నేతలకు కాకుండా భక్తిభావం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed