- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Sleeping tips : జీన్స్ వేసుకొని నిద్రపోతున్నారా..? అయితే ఇవి గుర్తుంచుకోండి!
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలామంది యువతీ యువకులు జీన్స్ ధరిస్తు్న్నారు. కంఫర్ట్ కంటే ట్రెండీ లుక్స్ కోసం వాటిని ఇష్టపడుతుంటారు. అలాగే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయనే ఉద్దేశంతోనూ పలువురు ఎంపిక చేసుకుంటారు. అయితే వీటిని ధరించి బయట తిరిగి వచ్చాక కొందరు అలాగే పడుకుంటూ ఉంటారు. దీంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
క్వాలిటీ స్లీప్ కోల్పోతారు
వాస్తవానికి జీన్స్ టైట్‌గా, మందంగా ఉంటాయి. వీటిని ధరించి నిద్రపోవడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే మధ్య మధ్యలో నిద్రకు ఆటంకం కలుగుతుంది. చర్మానికి రాసుకుపోవడంవల్ల చిరాకుగా అనిపిస్తుంది. ఫలితంగా నాణ్యమైన నిద్రకు దూరం అవుతారు. క్రమంగా అది హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే సున్నితమైన చర్మతత్వం కలిగిన వారు జీన్స్ ధరించి పడుకోవడంవల్ల చర్మంపై దద్దుర్లు రావచ్చు. కాబట్టి అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీరు ధరించే జీన్స్ కూడా కారణమేమో పరిశీలించుకోండి.
చర్మ సమస్యలకు అవకాశం?
బిగుతుగా ఉండే జీన్స్ ధరించి నిద్రపోవడంవల్ల చర్మం రాపిడికి గురవుతుంది. తొడల మధ్య తేమ ఎక్కువగా అవడంవల్ల బ్యాక్టీరియా పెరిగే చాన్స్ ఉంటుందని చర్మ వ్యాధి నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా స్కిన్ ఇన్‌ఫెక్షన్లు, తద్వారా అలెర్జీలు, దురద, చిరాకు వంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
రక్త ప్రసరణకు ఆటంకం
చర్మానికి గట్టిగా అతుక్కుని ఉండటం వల్ల బిగుతైన జీన్స్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రక్త ప్రసరణకు ఆటంకం కలిగించవచ్చు. దీంతో శరీరంలోని అవయవాలకు సరైన సమయంలో, సరైన విధంగా బ్లడ్ సరఫరా కాకపోవడం కారణంగా మొత్తం శరీర పనితీరులో మార్పు వస్తుంది. అలాగే జీన్స్ ధరించి పడుకోవడంవల్ల బాడీలో హీట్ కూడా పెరుగుతంది. ఇవన్నీ తర్వాత మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
కదలికలో ఇబ్బందులు
జీన్స్ ప్యాంట్లు ధరించి పడుకున్నప్పుడు శరీర కదలికల్లో అసౌకర్యం ఏర్పడుతుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. ప్రేగు కదలికలు కూడా సక్రమంగా లేకపోవడంతో జీర్ణ క్రియపై ప్రభావం పడుతుంది. దీంతో కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే జీన్స్‌కు ఉండే బటన్స్ కడుపుపై, నడుముపై రాసుకుపోవడంవల్ల ర్యాషెస్ ఏర్పడతాయి.
ఎలాంటి దుస్తులు బెటర్?
స్టైలిష్ కోసం జీన్స్ వేసుకోవచ్చు. కానీ నిద్రపోయే ముందు మాత్రం కంఫర్టబుల్ క్లాత్స్ ధరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సిల్క్, కాటన్ వంటి శరీరానికి గాలి తగిలేందుకు సహాయపడే దుస్తులు ఎంచుకోండి. అలాగే అవి టైట్‌గా కాకుండా, వదులుగా, సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం మంచిది. దీంతో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఎలాంటి ఒత్తిడి, రాపిడి లేకపోవడంవల్ల చక్కగా నిద్రపడుతుంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం.