- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Harish Rao: గోబెల్స్ ప్రచారం చేస్తున్న రేవంత్: హరీశ్ రావు ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రైతులందరికీ రుణమాఫీ చేయకుండానే మహారాష్ట్ర వెళ్లి చేశామని సీఎం రేవంత్ రెడ్డి ఎలా చెబుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ రోజు (ఆదివారం) తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో11 నెలలుగా ఇంకా రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగుతూనే ఉందని, కానీ మహారాష్ట్ర వెళ్లిన సీఎం.. తాము 22 రోజుల్లో రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేశామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ అందడమే ఆలస్యంగా అందిందని, అందులో కూడా ఇప్పటివరకు కేవలం 20 లక్షల మంది రైతులకు మాత్రమే అందిందని, మరో 22 లక్షల మందికి అందాల్సి ఉందని చెప్పిన హరీశ్ రావు.. ఏఐసీసీ 40 లక్షల మందికి రుణమాఫీ చేశామని చెప్పడాన్ని ఖండించారు. కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. ఈ లెక్కలు మహారాష్ట్ర ప్రజలకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుక చెప్పలేదని హరీశ్ రావు ప్రశ్నించారు.