NHRC Team: లగచర్ల నిందితుల్ని కలిసిన NHRC బృందం

by Rani Yarlagadda |
NHRC Team: లగచర్ల నిందితుల్ని కలిసిన NHRC బృందం
X

దిశ, వెబ్ డెస్క్: లగచర్ల ఘటనలో అరెస్టై.. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులను 8 మంది సభ్యులతో కూడిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) బృందం ఆదివారం కలిసింది. ఈ కేసులో ఏ2 నిందితుడు సురేష్ సహా 19 మంది నిందితులు సంగారెడ్డి జైల్లోనే ఉన్నారు. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న NHRC బృందం.. ఈ రోజు ఉదయం సంగారెడ్డి జైలుకు వెళ్లింది. లగచర్ల ఘటనలో ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకుంది.

లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటును అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కలెక్టర్ అక్కడికి వెళ్లగా రైతులు దాడి చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ తర్వాత రికార్డైన వీడియోల ద్వారా నిందితుల్ని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో 19 మందిని సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. కలెక్టర్ పై దాడి ఘటన NHRCకి చేరడంతో.. 8 మంది సభ్యులతో ఒక టీమ్ ఏర్పాటైంది. ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి.. బాధితులకు న్యాయం చేసేందుకు NHRC రంగంలోకి దిగింది.

Advertisement

Next Story

Most Viewed