Mann Ki Baat: వికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకం

by Shamantha N |
Mann Ki Baat: వికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకం
X

దిశ, నేషనల్ బ్యూరో: వికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్‌కీ బాత్‌’(Mann Ki Baat) 116వ ఎపిసోడ్ లో మాట్లాడారు. ఈ ఆదివారం ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎన్సీడీ డే అని అన్నారు. ఎన్‌సీసీ పేరు వినగానే మనకు స్కూల్-కాలేజీ రోజులు గుర్తుకొస్తాయని, తాను ఎస్‌సీసీ విద్యార్థిని అని తెలిపారు. ఆ సమయంలో తాను పొందిన అనుభవం అమూల్యమైనదని పేర్కొన్నారు. ఎన్‌సీసీ అనేది యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా స్ఫూర్తిని పెంపొందిస్తుందన్నారు. విపత్తుల సమయంలో సహాయం చేయడానికి ఎన్‌సీసీ అభ్యర్థులు ఎల్లప్పుడూ ముందు ఉంటారని, విద్యార్థులందరూ ఎన్‌సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. వికసిత భారత్(Viksit Bharat) ని నిర్మించేందుకు యువత పాత్ర ఎంతో కీలకమని అన్నారు. యువత అంతా ఒక్కతాటిపైకి వచ్చి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే త్వరతగతిని అభివృద్ధి జరుగుతుందన్నారు.

‘మన్ కీ బాత్’

‘మన్ కీ బాత్’ అంటే దేశానికి సంబంధించిన సమిష్టి కృషి గురించి మాట్లాడటమన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంటానని చెప్పుకొచ్చారు. దేశం సాధించిన విజయాలు ఇక్కడి ప్రజల శక్తితో ముడిపడివున్నాయన్నారు. వీలైనన్ని ఎక్కువ సందేశాలను అందించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాని అన్నారు. అలానే, ప్రజలు అందించే సూచనల కోసం ఎదురుచూస్తుంటానని చెప్పారు. అలానే, కార్యక్రమంలో స్వామి వివేకానందను స్మరించుకున్నారు. వచ్చే ఏడాది స్వామి వివేకానంద 162వ జయంతి (62nd birth anniversary of Swami Vivekananda) ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 11, 12 వ తేదీల్లో ఢిల్లీలోని భారత్‌ మండపంలో ‘యంగ్‌ ఐడియాస్‌ మహాకుంభ్‌’ జరగనుందని, ఈ కార్యక్రమానికి రెండు వేల మంది యువత తరలిరానున్నారని తెలిపారు. అలానే, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువత రాజకీయాల్లోకి రావాలని గతంలోనే తాను పిలుపునిచ్చినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed