Samantha: నా మాజీ కోసం ఖరీదైన గిఫ్ట్స్ కొని డబ్బు వృధా చేశా.. సమంత షాకింగ్ కామెంట్స్ (వీడియో)

by Hamsa |   ( Updated:2024-11-25 12:05:41.0  )
Samantha: నా మాజీ కోసం ఖరీదైన గిఫ్ట్స్ కొని డబ్బు వృధా  చేశా.. సమంత షాకింగ్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), నాగచైతన్య(Naga Chaitanya) ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక నాగచైతన్య డిసెంబర్‌లో శోభితను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. సమంత మాత్రం మయోసైటీస్ వ్యాధి రావడంతో సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవల మళ్లీ ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది. రాజ్ అండ్ డికే తెరకెక్కించిన ఈ సిరీస్‌తో వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా నటించాడు.

అయితే అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో.. సమంత, వరుణ్ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోయినా తప్పుగా చెప్పినా పచ్చి మిర్చి తినాల్సి ఉంటుంది. అయితే వరుణ్ ‘‘అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేని కోసం ఖర్చు పెట్టారు. అని’’ అడిగాడు.

ఇందుకు సమంత ‘‘నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకలకు డబ్బులు వృధా చేశా’’ అనగా.. ‘ఎంత ధర ఉంటాయి’ అంటాడు. దీంతో కాస్త ఎక్కువే ఇక కొనసాగిద్దాం’’ అని ముగించింది. ఆ తర్వాత రాపిడ్ ఫైర్‌లో భాగంగా.. ‘ఇక్కడికి రావడానికి ముందు మీరు ఎవరికి మెసేజ్ చేశారు’ అనడంతో సమంత సమాధానం చెప్పకుండా పచ్చిమిర్చి తిన్నది. ప్రజెంట్ సమంత(Samantha) కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఇండైరెక్ట్‌గా నాగచైతన్య గురించే చెప్పిందని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed