పిల్లల బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలంటే.. ఈ ఆహారాలు పెట్టండి..!

by Kanadam.Hamsa lekha |
పిల్లల బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలంటే..  ఈ ఆహారాలు పెట్టండి..!
X

దిశ, ఫీచర్స్: పిల్లలు ఒక స్థాయికి ఎదిగే వరకు కూడా తల్లిదండ్రులు వారిపై శ్రద్ధ చూపుతారు. ముఖ్యంగా వాళ్లకి ఇచ్చే ఆహార విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఎదిగే పిల్లల ఆహార విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మేధావులు కావాలని కోరుకుంటారు. మేధావులు కావాలంటే కేవలం పాఠశాలలకు పంపించడం, చిన్నతనంలోనే రాయడం, చదవడం నేర్పించడం కాదు. వారికి పోషణనిన్చే ఆహారం ఇవ్వడం ముఖ్యం. పోషకాహారం ఇవ్వడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రతతోపాటుగా మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పిల్లలకు రోజూ ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఇక్కడ చూద్ధాం.

పెరుగు: పిల్లలకు పెరుగు తినిపిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇది ప్రోబయోటిక్ అవసరాలను తీరుస్తుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా పిల్లలను చురుకుగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ బ్యాక్టీరియా జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీని వల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయి. పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది మెదడు, గుండెకు ప్రయోజనం చేకూర్చి, ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్- సి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. పిల్లలకు పెరుగును క్రమం తప్పకుండా తినిపించడం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం.

ఒమెగా-3 ఆహారాలు: ఇవి పిల్లల మెదడును చురుకుగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. వాల్‌నట్స్, అవిసె గింజలు, గుడ్లు, చేపలు, ఆకు కూరలు, కూరగాయలలో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మొలకలు: మొలకలలో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉదయం, సాయంత్రం పిల్లలకు తినిపిస్తే, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

అరటి పండు: పిల్లలకు అరటిపండు మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ మెండుగా ఉంటాయి. ఇది తినిపించడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed