ట్రంప్ ఫోన్ కాల్.. నిజం కాదన్న నెతన్యాహు

by M.Rajitha |
ట్రంప్ ఫోన్ కాల్.. నిజం కాదన్న నెతన్యాహు
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఎలాంటి ఫోన్ కాల్ మాట్లాడలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల వంటి అంశాలపై వీరు ఇరువురు చర్చించుకున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. నెతన్యాహు నుండి ఈ వివరణ వచ్చింది. మీడియాలో వార్తలు వచ్చినట్టు ట్రంప్-నెతన్యాహు మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదు అని నెతన్యాహు ఆఫీస్ స్పష్టం చేసింది. కాగా ఈ విషయం మీద డొనాల్డ్ ట్రంప్ నునబడి ఎలాంటి స్పందన రాలేదు. కాగా ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళిన నెతన్యాహు నాలుగేళ్ల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. మొదటి నుండి ఇజ్రాయెల్- హమాస్ యుద్దం ముగియాలని ట్రంప్ పిలుపునిస్తున్నారు. అయితే అమెరికా మాత్రం ఇజ్రాయెల్ కు మద్దతు పలుకుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed