Bigg Boss-18: అప్పటినుంచే స్టార్ట్.. ఈ సారి హోస్ట్ ఎవరంటే? (వీడియో)

by Hamsa |   ( Updated:2024-09-23 10:51:17.0  )
Bigg Boss-18: అప్పటినుంచే స్టార్ట్.. ఈ సారి హోస్ట్ ఎవరంటే? (వీడియో)
X


దిశ, సినిమా: రియాలిటీ బిగ్‌బాస్ షో అన్ని భాషల్లో ప్రేక్షాదరణ పొందుతూ నంబర్ వన్ షోగా దూసుకుపోతుంది. అయితే తెలుగులో సెప్టెంబర్ 1న బిగ్‌బాస్-8 మొదలై ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో తొందరలోనే మొదలు కాబోతున్నట్లు ఇటీవల ప్రోమో వీడియో ద్వారా ప్రకటించారు. తాజాగా, హిందీ బిగ్‌బాస్-18 త్వరలోనే మొదలు కాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

అంతేకాకుండా ఓ ప్రోమో వీడియోను విడుదల చేశారు. అక్టోబర్ 6 నుంచి సీజన్ 18 మొదలు కాబోతున్నట్లు అధికారికంగా తెలిపారు. అయితే ఈ సీజన్‌కు కూడా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ ప్రోమో హాలీవుడ్ మూవీలాగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే బిగ్‌బాస్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుసుకున్న ప్రేక్షకులు ఇందులో ఎవరెవరు పాల్గొంటారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

(Credit to Colors TV YouTube Channel)

Advertisement

Next Story