Seethakka : నేను మీ ఫ్యాన్! మంత్రి సీతక్కతో నమ్రత.. నెటిజన్ల ప్రశంసలు

by Ramesh N |
Seethakka : నేను మీ ఫ్యాన్! మంత్రి సీతక్కతో నమ్రత.. నెటిజన్ల ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరద బాధితుల సహాయార్థం టాలీవుడ్ సూపర్ స్టార్, నటుడు మహేష్ బాబు తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసి రూ. 50 లక్షల విరాళం చెక్కును అందజేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఇంటి వద్ద ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

అదే సమయంలో సీఎం వద్ద ఉన్న మంత్రి సీతక్కను చూసి మహేష్ బాబు సతీమణి నమ్రత కలిశారు. సీతక్కను చూడగానే ఆమె దగ్గరకు నమ్రత వెళ్లారు. సీతక్కను అభినందిస్తూ.. మీకు ఫ్యాన్ అంటూ నమ్రత మంత్రితో ఫోటో దిగినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సీతక్క అంటే ఎవరికైనా అభిమానమేనని, నమ్రతను నెటిజన్లు ప్రశంసించారు.

Next Story

Most Viewed