శ్రీవారి లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్.. రెండు సంస్థలకు నోటీసులు

by srinivas |
శ్రీవారి లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్.. రెండు సంస్థలకు నోటీసులు
X

దిశ, డెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Dispute)పై కేంద్రప్రభుత్వం (Central Government) సీరియస్ అయింది. తిరుమలకు నెయ్యి (Ghee) సరఫరా చేసిన రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐతో పాటు తమిళనాడు చెందిన ఏఆర్ డెయిరీని ఆదేశించింది.

వైఎస్ జగన్ ప్రభుత్వ (Jagan Government) హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల అవవేషాలు కలిశాయని నిర్ధారణకావడంతో రాజకీయ దుమారం రేగింది. అధికార, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరోవైపు శ్రీవారి భక్తులు, హిందువులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూను అప్రవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నెయ్యి సరఫరా చేసిన FSSAI, AR Dairyకి నోటీసులు జారీ చేసింది.

Read More : తిరుపతి లడ్డులో అంబర్ ప్యాకెట్ లభ్యం. స్పందించిన ఏపీ సీఎం

Next Story

Most Viewed