Maharashtra: నీ నియోజకవర్గంలో ర్యాలీ చేస్తే ఎలా ఉండేదో తెలుసా?

by Shamantha N |
Maharashtra: నీ నియోజకవర్గంలో ర్యాలీ చేస్తే ఎలా ఉండేదో తెలుసా?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో (Maharashtra elections) పవార్‌ కుటుంబాల (Pawars) మధ్య పోటీ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, రు ప్రాముఖ్యం సంతరించుకుంది. కాగా, ఎన్నికల తర్వాత తొలిసారిగా ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్‌ పవార్‌, ఆయన సోదరుడి కుమారుడు ఎన్సీపీ (ఎస్పీ)నేత రోహిత్‌ పవార్‌ ఒకరికొకరు ఎదురుపడ్డారు. మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వై బీ చవాన్‌ వర్ధంతి కార్యక్రమంలో బాబాయి (అజిత్‌ పవార్‌), అబ్బాయి (రోహిత్‌ పవార్‌)ల మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది. రోహిత్ ని చూసిన వెంటనే అజిత్‌ చిరునవ్వులు చిందిస్తూ ‘‘ వచ్చి ఆశీర్వాదం తీసుకో.. అతి కష్టంగా నెగ్గావు. నీ నియోజకవర్గంలో నేను ర్యాలీ చేసిఉంటే ఎలా ఉండేదో తెలుసా?’’ అంటూ చమక్కులు విసిరారు. దీంతో రోహిత్‌ ఆయన కాళ్లకు నమస్కరించారు. ఆ తర్వాత రోహిత్‌ పవార్‌ మీడియాతో మాట్లాడారు. తమ మధ్య రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా అజిత్ పవార్ తమకు తండ్రిత సమానమని అన్నారు. పెద్ద వాళ్లను గౌరవించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అజిత్ తనకు సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. బారామతిలో బిజీగా ఉన్నందువల్ల ఈ ఎన్నికల్లో తన తరఫున ప్రచారానికి హాజరుకాలేకపోయారని అన్నారు.

స్వల్ప ఓట్లతో గెలిచిన రోహిత్

ఇకపోతే, ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రోహిత్‌ పవార్‌ ఖజరత్‌ జమ్‌ఖేడ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1,234 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో నెగ్గారు. ఇకపోతే, పవార్ల కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతిలో (Baramati Assembly) ఇటీవల పవార్‌ కుటుంబసభ్యుల మధ్యే పోటీకి వేదికగా నిలిచింది. ఎన్సీపీ తరఫున అజిత్‌ పవార్‌ ఈ స్థానం నుంచి బరిలోకి దిగగా, ఆయన సోదరుడు శ్రీనివాస్‌ కుమారుడు యుగేంద్ర పవార్‌ ఇదే స్థానం నుంచి ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేశారు. కాగా.. అజిత్ పవార్ ఎన్నికల్లో గెలిచారు. మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లు ఉండగా.. మహాయుతి కూటమి 233 స్థానాల్లో గెలిచింది. ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి 51 చోట్ల గెలుపొందింది.

Advertisement

Next Story