గుడ్ న్యూస్ ప్రకటించిన బుల్లితెర హీరో మానస్.. పోస్ట్ వైరల్

by Hamsa |
గుడ్ న్యూస్ ప్రకటించిన బుల్లితెర హీరో మానస్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బుల్లితెర హీరో మానస్(Manas) పలు సిరీయల్స్‌లో నటించి మెప్పించాడు. ప్రజెంట్ ఆయన ‘బ్రహ్మముడి’(Brahmamudi)లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక మానస్ సినిమాల్లోనూ నటించాడు. ‘ఝలక్’, గ్రీన్ సిగ్నల్, ప్రేమికుడు వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాడు. అంతేకాకుండా తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5(Bigg Boss Season 5)లో పాల్గొని ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇక మానస్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన గత ఏడాది శ్రీజ(Sreeja)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది జూలైలో భార్య ప్రెగ్నెన్సీ(Pregnancy) విషయాన్ని ప్రకటించాడు. ఇప్పుడు మానస్ మరో గుడ్ న్యూస్ అనౌన్స్ చేశాడు. బాబు పుట్టినట్టు తెలుపుతూ ఫొటోలు షేర్ చేశాడు. అయితే తన కొడుకుకు ‘ధ్రువ’’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

Advertisement

Next Story