- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీలోకి ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’
దిశ, సినిమా: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival)లో సత్తాచాటిన భారతీయ చిత్రం ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’(All We Imagine as Light) ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్‌లో ఈ సినిమా జనవరి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్ర బృందం. పాయల్ కపాడియా(Payal Kapadia) దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ఇదే. ముంబై నర్సింగ్ హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో కని కుశ్రుతి(Kani Kushruti), దివ్య ప్రభ(Divya Prabha) ప్రధాన పాత్రల్లో నటించారు. విభిన్నమైన కథతో డ్రామా ఫిల్మ్‌గా రూపొందిన ఈ మూవీ ఈ ఏడాది జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. ఇక రీసెంట్‌గా 82వ గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారా(Golden Globes Awards)లకు నామినేట్ అయింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని చూసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Former US President Barack Obama).. 2024లో తనకు నచ్చిన సినిమాల్లో ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ ఒకటని ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. కాగా.. తెలుగులో ఈ సినిమాకు రానా(Rana) రిలీజ్ చేశాడు.