- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నుమాయిష్ కు సర్వం సిద్ధం
దిశ, కార్వాన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 84 వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాలకు సర్వం సిద్ధం అయ్యాయి. జనవరి 1న మొదలై ఫిబ్రవరి 15 వరకు (46 రోజుల పాటు) నిర్విరామంగా జరుగనున్న ఎగ్జిబిషన్ కు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 1938 లో నిజాం కాలంలో మొదలైన నుమాయిష్ కు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ నలుమూలల నుండి సందర్శించేందుకు సందర్శకులు వస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి జనవరి 1 నుమాయిష్ ను ప్రారంభించనున్నారు. సందర్శకుల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ సొసైటీ గాంధీ భవన్, అజంతా, గోషామహల్ గేట్లు అందుబాటులో ఉంచింది.అంతే కాకుండా సీసీ కెమెరాలు, భద్రత బలగాలతో పాటు సందర్శకులు మైదానంలో విలాసవంతంగా తిరిగేందుకు రోడ్లను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నుమాయిష్ లో జమ్మూ కాశ్మీర్ లోని డ్రై ఫ్రూట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి చేతితో తయారు చేసినవీ కాకుండా హస్తకళ వస్తువులు అలాగే దేశంలోని అత్యుత్తమ బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అన్ని రకాల స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. 46 రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. వివిధ శాఖల అధికారులు ఫైర్, పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వీటితో పాటు సీసీ కెమెరాలు,మరుగుదొడ్లు, మంచినీటి వసతులు ప్రైవేటు సెక్యూరిటీ వాలంటీర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి వ్యక్తినీ క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతించేందుకు ప్రైవేటు సెక్యూరిటీతో పాటు వాలంటరీస్ ని ఏర్పాటు చేశారు.