Joe Biden: మన్మోహన్ సింగ్ లేకపోతే అణుఒప్పందం సాధ్యం కాకపోయేది

by Shamantha N |
Joe Biden: మన్మోహన్ సింగ్ లేకపోతే అణుఒప్పందం సాధ్యం కాకపోయేది
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) కు నివాళులర్పించారు. ఆయనను "గొప్ప రాజనీతిజ్ఞుడు" మరియు "అద్భుతమైన ప్రజా సేవకుడు" అని పేర్కొన్నారు. " మన్మోహన్ సింగ్ వ్యూహాత్మక దృష్టి లేకుంటే భారత్, అమెరికా మధ్య అపూర్వమైన సహకారం సాధ్యమయ్యేది కాదు. భారత్- అమెరికా పౌర అణు ఒప్పందం(US-India Civil Nuclear Deal) ఆయన లేకుంటే సాధ్యం కాకపోతేయి. అణుఒప్పందం నుంచి ఇండో- పసిఫిక్ భాగస్వాముల కోసం క్వాడ్ ను ప్రారంభించడం వరకు ఆయన కృషి మరువలేనిది." అని బైడెన్ అన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబసభ్యులకు జోబైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 2008లో సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నప్పడు మన్మోహన్ సింగ్ తో భేటీ అయ్యానని గుర్తు బైడెన్ చేసుకున్నారు. 2013లో భారత్ వచ్చినప్పుడు తనకు అతిథ్యం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు చర్చించుకున్నట్లుగానే ఇరు దేశాల సంబంధాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed