Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభం..

by Shiva |   ( Updated:2024-12-28 05:22:17.0  )
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభం..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అంతిమ యాత్ర కాసేపటి క్రితం ఢిల్లీ (Delhi)లోని ఏఐసీసీ (AICC) కార్యాలయం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి యాత్ర నిగమ్‌బోధ్ ఘట్ (Nigambodh Ghat) వరకు నిర్విరామంగా కొనసాగనుంది. ఈ మేరకు ప్రభుత్వ లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం ఆయన అంత్యక్రియలకు నిర్వహిస్తోంది. అయితే, అంతియ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, మన్మోహన్ సింగ్ పార్థీవ దేహాన్ని శనివారం ఉదయం ప్రజల సందర్శనార్థం ఏఐసీసీ (AICC) కార్యాలయానికి తరలించారు. అక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ప్రధాని భౌతికకాయానికి నివాళలర్పించారు. అదేవిధంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ సింగ్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వెళ్లారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అంతియ యాత్ర వెంటనే కార్లలో ప్రముఖులంతా నిగమ్‌బోధ్‌కు క్యూ కట్టారు.

Next Story