ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో అభిమానులు థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తారు.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో అభిమానులు థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తారు.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj). ప్రగ్యాజైశ్వాల్(Pragya Jaiswal) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీ పై భారీ అంచనాలను పెంచాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.

ఇక రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తాదా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా నాగ వంశీ మాట్లాడుతూ.. ‘డాకు మహారాజ్ సినిమా విరామానికి 20 మినిట్స్ ముందు ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్ అడ్రినలిన్ రష్ ఇస్తుంది. ప్రీ- ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో అభిమానులు ఆనందంతో థియేటర్లలో గట్టిగా అరుస్తూ కాగితాల వర్షం కురిపిస్తూ రచ్చ రచ్చ చేస్తారు’ అంటూ నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అయితే పక్కా బాలయ్య బాబు వన్ మ్యాన్ షో అయి ఉంటుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed