- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను.. అభిమాని సుసైడ్ లెటర్(పోస్ట్)
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అంజలి, సునీల్, సముద్ర ఖని, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఇప్పటి వరకు ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంతో ఓ అభిమాని ఏకంగా సూసైడ్ లెటర్ రాసి మరి షాకిచ్చాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక వైరల్ అవుతున్న లెటర్ ప్రకారం.. ‘గౌరవనీయులైన గేమ్ ఛేంజర్ గారికి నేను అనగా.. ఈశ్వర్ చరణ్ అన్న ఫ్యాన్.. చింతిస్తూ రాయునది ఏమనగా.. సినిమాకి ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. మీరు ఏ విధమైనటువంటి ట్రైలర్ అప్‌డేట్ ఇవ్వట్లేదు. కనీసం అభిమానుల ఎమోషన్స్‌ని పట్టించుకోవట్లేదు. ఈ నెల ఆఖరు కల్లా మీరు ట్రైలర్ అప్‌డేట్ ఇవ్వకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడుతానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.. ఇట్లు మీ విధేయుడు, చరణ్ అన్న భక్తుడు ఈశ్వర్’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరి దీనిపై మూవీ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.