ఆ సమయంలో సినిమాల్లోకి ఎందుకొచ్చానా అని చాలా బాధపడ్డా.. : వెంకటేష్

by Prasanna |   ( Updated:2024-12-28 04:19:19.0  )
ఆ సమయంలో సినిమాల్లోకి ఎందుకొచ్చానా అని చాలా బాధపడ్డా.. : వెంకటేష్
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో హీరోయిన్లు సినిమా షూటింగ్స్ లో యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు కొన్ని సార్లు గాయాలపాలవుతారు. కొంతమందికి అయితే పెద్ద గాయాలే అవుతుంటాయి. దీని నుంచి కోలుకోడానికి నెలల పాటు సమయం పడుతుంది. విక్టరీ వెంకటేష్ కి కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తాజాగా, బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన వెంకటేష్ (Venkatesh) తనకు తగిలిన దెబ్బలు గురించి వెల్లడించాడు.

వెంకటేష్ మాట్లాడుతూ.. " ఒక ఫైట్ లో గాయం అయింది. కొన్ని రోజుల్లో తగ్గుతుందేమో అనుకున్నా .. కానీ, చాలా రోజులు బాధపడ్డాను. లెఫ్ట్ సైడ్ బాడీ మొత్తం తట్టుకోలేని నొప్పి వచ్చేది. స్పాండిలోసిస్ లాగా అనిపించేది. దానివల్ల బాగా కోపం వచ్చేది. అప్పుడు, అసలు సినిమాల్లోకి ఎందుకొచ్చానా" అని అనిపించింది అని తెలిపారు.

ఈ ఎపిసోడ్ కి వెంకటేష్ తో పాటు సురేష్ బాబు (Suresh Babu), అనిల్ రావిపూడి ( Anil Ravipudi), ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, భీమ్స్ సిసిరోలియో వెళ్లారు. "సంక్రాంతికి వస్తున్నాం" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వీరందరూ వచ్చి సందడీ చేశారు.

Read More : Venkatesh: ఆ సీన్ మా అన్నయ్యకు ఇష్టం.. వంద పాములతో చేశానంటూ బాలయ్య షోలో వెంకటేష్ కామెంట్స్..

Advertisement

Next Story

Most Viewed