- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Nitish Kumar Reddy' : వైరల్ గా నితీష్ కుమార్ రెడ్డి పుష్ప స్టైల్ "తగ్గేదేలే"

దిశ, వెబ్ డెస్క్ : అస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్టు(Australia vs India) సిరీస్ లోని నాల్గవదైన బాక్సింగ్ డే టెస్టు(4th Test day 3)లో హాఫ్ సెంచరీతో రాణించిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పుష్ప సినిమా స్టైల్ వైరల్ గా మారింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేయగానే తన సెలబ్రేషన్ ను నితీష్ కుమార్ రెడ్డి పుష్ప హీరో అల్లు అర్జున్ మేనరిజాన్ని అనుకరిస్తూ గడ్డం కిందుగా బ్యాట్ తో నీయవ్వ.. తగ్గేదేలే అంటూ అభివాదం చేశాడు.
మూడవ రోజులో ఆటకు వర్షంతో అంతరాయం కలిగే సమయానికి నితీష్ కుమార్ రెడ్డి 85పరుగులతో ఆడుతున్నాడు. వాషింగ్టన్ సుందర్ 40పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. వారిద్ధరు 8వ వికెట్ కు 105పరుగుల జోడించడంతో భారత్ ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. ఆట నిలిచిపోయే సమయానికి టీమ్ ఇండియా 326/7పరుగులు సాధించింది. అసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 474పరుగులు సాధించింది.