- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sharmistha Mukherjee: కాసేపట్లో మాజీ ప్రధాని అంత్యక్రియలు.. ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Former Prime Minister Dr. Manmohan Singh) అంత్యక్రియలు ఇవాళ ఉదయం 11.45కు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ (Nigambodh) ఘాట్‌లో జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ (Central Home Ministry) నుంచి రక్షణ శాఖ (Defense Ministry)కు ఆదేశాలు అందాయి. అయితే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) పార్థీవ దేహాన్ని ఆయన నివాసం నుంచి కాసేపటి క్రితం కాంగ్రెస్ (Congress) నాయకులు ప్రజల సందర్శనార్థం ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి ఆయన అంతిమయాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది.
ఈ క్రమంలోనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ (Sharmistha Mukherjee) కాంగ్రెస్ అగ్ర నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చనిపోయినప్పుడు కనీసం సీబ్ల్యూసీ (CWC) సమావేశం కాలేదని ఆరోపించారు. రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో సీడబ్ల్యూసీ (CWC) సంతాపం తెలిపే ఆనవాయితీ లేదంటూ ఓ నేత చెప్పారని అన్నారు. కానీ, కేఆర్ నారాయణన్ (KR Narayanan) చనిపోతే సీడబ్ల్యూసీ (CWC) సమావేశమై సంతాపం తెలిపారని గుర్తు చేశారు. ఆయన సంతాప సందేశాన్ని ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee)నే రాశారని పేర్కొన్నారు. తన తండ్రి విషయంలో కాంగ్రెస్ పెద్దలు తనను తప్పుదోవ పట్టించారని శర్మిష్ఠ ముఖర్జీ కామెంట్ చేశారు.