- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు మోటార్ సైకిళ్లు ఢీకొని ఇద్దరు మృతి
దిశ, కారేపల్లి : ఎదురెదురుగా వస్తున్న మోటార్ సైకిళ్లు ఢీకున్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి ఓసీ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఉసిరికాయలపల్లికి చెందిన ఎల్లావుల మల్లయ్య(40)తో పాటు మరో ఇద్దరు టీవీఎస్ ఎక్సెల్ పై ఇల్లందు వెళ్తున్నారు. అలాగే ఇల్లందు నుంచి కారేపల్లిలో పల్సర్ వాహనంపై టి.లక్ష్మణ్ తో పాటు మరో వ్యక్తి వస్తున్నారు.
ఉసిరికాయలపల్లి ఓసీ మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఈ రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎల్లావుల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మారుతి వెంకటేశ్‌కు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దాంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురికి సైతం గాయాలు కావడంతో అందరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్ధలాన్ని ఎస్సై ఎన్.రాజారాం సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.