- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లాలో ట్రాక్టర్ దొంగల హల్చల్...
దిశ, ఘట్కేసర్ : రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్రెషర్ ట్రాక్టర్ల దొంగలు హల్చల్ చేశారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ లక్ష్మీ నరసింహ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి ఏడు కంప్రెషర్ ట్రాక్టర్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున ఇండ్ల ముందు పార్క్ చేసిన ట్రాక్టర్లు లేకపోవడంతో యజమానులు కంగుతిన్నారు. కాలనీ పరిసర ప్రాంతాల్లో వెతకగా నాలుగు ట్రాక్టర్లు చెట్ల తుప్పల్లో, రోడ్డు పక్కన పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బాధితులు పోచారం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.10 లక్షల విలువైన ట్రాక్టర్లు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.
బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ రాజు వర్మ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇటీవల కాలంలో పోచారం పీఎస్ పరిధిలో సెంట్రింగ్ బాక్సులు, పార్క్ చేసిన వాహనాల టైర్లు దొంగతనాలే కాకుండా ఈసారి సరికొత్తగా కంప్రెషర్ ట్రాక్టర్లను టార్గెట్ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీటీవీ కెమెరాలు కూడా సరిగా పని చేయకపోవడం దొంగతనాలకు కారణమని తెలుస్తోంది. అర్ధరాత్రి దాటితే చాలు ఎప్పుడు ఏం దొంగతనం జరుగుతుందోనని కాలనీలలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఏది ఏమైనా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో జరుగుతున్న దొంగతనాలు పోలీసులకు సవాలుగా తయారయ్యాయి. ఇప్పటికైనా పోలీసు యంత్రంగా మేల్కొని దొంగల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.