Heroine: పది రోజుల షూటింగ్ కు 9 కోట్లు తీసుకున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?

by Prasanna |
Heroine: పది రోజుల షూటింగ్ కు 9 కోట్లు తీసుకున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొంతకాలం నుంచి మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. దీంతో, బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు తెలుగు మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలీవుడ్ సినిమాల్లో చిన్న అవకాశం వచ్చినా కూడా ఓకే అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు స్టార్ హీరోయిన్లు క్రేజ్‌ను బట్టి భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ( Alia Bhatt) కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ సరసన ఆర్ఆర్ఆర్ ( RRR) లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మహేశ్ భట్ ( Mahesh Bhatt) కూతురుగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. మొదటి మూవీతోనే హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

ఆలియా భట్ మన తెలుగులో 'RRR' లో నటించింది. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమాకి ఆలియా పది రోజులు షూటింగ్‌లో పాల్గొందట. అయితే, పదిరోజులకు ఏకంగా రూ.9 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని తెలిసిన సమాచారం. మన ఇంట్లో కూర కంటే , పక్కింటి కూర మంచిగా ఉన్నట్లు తెలుగు వాళ్ళని పక్కన పెట్టి, ఇతర భాష వాళ్ళని తీసుకొచ్చుకుంటే ఖర్చులు కూడా అదే రేంజ్లో ఉంటాయి మరి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed