కడప జిల్లాలో రైతు ఫ్యామిలీ సూసైడ్.. స్పందించిన మంత్రులు

by srinivas |
కడప జిల్లాలో రైతు ఫ్యామిలీ సూసైడ్.. స్పందించిన మంత్రులు
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa district) దిద్దేకుంట(Diddekunta)లో రైతు కుటుంబం ఆత్మహత్య(Farmer family suicide) చేసుకుంది. చీనీ పంట సాగు చేసేందుకు రైతు నాగేంద్ర భారీగా అప్పులు చేశారు. అనుకుంత ఆదాయం రాకపోవడం, అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరగంతో నాగేంద్ర మనస్థాపం చెందారు. భార్య వాణి, ఇద్దరు పిల్లలు భార్గవ్, గాయత్రిని చీనీ తోటలోనే ఉరివేసి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత స్పందించారు.

రైతు కుటుంబం ఆత్మహత్యపై కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత(Minister Savita) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అన్నదాత కుటుంబం బలవన్మరణం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి సవిత హామీ ఇచ్చారు.

మరోవైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబంతో సహా రైతు ఆత్మహత్య చేసుకున్న వార్తపై విచారణ చేయాలని, అలాగే కారణాలు తెలియచేయాలని అధికారులను ఆయన ఆదేశింaచారు.

Advertisement

Next Story

Most Viewed