మాజీ ప్రధాని, మన్మోహన్ సింగ్ మృతికి కేంద్రం సంతాపం.. ఆఫ్ డే సెలవు ప్రకటన

by Mahesh |
మాజీ ప్రధాని, మన్మోహన్ సింగ్ మృతికి కేంద్రం సంతాపం.. ఆఫ్ డే సెలవు ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh)గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ (Delhi)లోని ఏయిమ్స్‌ (AIMS)లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా ఆయన మృతిపై కేంద్ర కేబినెట్(Central Cabinet) అత్యవసర సమావేశం(Emergency meeting) నిర్వహించింది. అనంతరం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని మృతికి సంతాపంగా(condolence) ఒక పూట సెలవు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో శనివారం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ ఆఫ్ డే సెలవు వర్తించనుంది. ఇప్పటికే డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే నేడు తెలంగాణ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed