మహిళలకు మాయమాటలు చెప్పి బంగారం చోరీ.. నిందితుడు అరెస్ట్

by Jakkula Mamatha |
మహిళలకు మాయమాటలు చెప్పి బంగారం చోరీ.. నిందితుడు అరెస్ట్
X

దిశ ప్రతినిధి, ధర్మవరం: ఇటీవల చోరీకి గురైన ఆరు తులాల బంగారాన్ని నిందితుడు నుంచి స్వాధీనం చేసుకున్నామని ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీ చెందిన సాకే నారాయణ మహిళలకు మాయ మాటలు చెప్పి బంగారాన్ని చోరీ చేసేవాడు అన్నారు.

అదేవిధంగా ఇళ్లకు తాళాలు వేసిన వాటిని గుర్తించి వాటిని పగలగొట్టి బంగారం చోరీ చేసినట్లు వివరించారు. నిందితుడు పై ప్రత్యేక నిఘా ఉంచి.. వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్‌తో పాటు ఎస్సై గోపి కుమార్, స్టేషన్ సిబ్బంది శివకుమార్, శివశంకర్, భాస్కర్ లో ఎర్రగుంట సర్కిల్‌లోనే ఆసుపత్రి వద్ద నిందితుడు శ్రీనివాసులను అరెస్ట్ చేశారు. నిందితుడు నుంచి ఆరు తులాల బంగారంను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed