- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంతితో, బ్యాటుతో రెచ్చిపోయిన దీప్తి.. వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్
దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకుంది. ఆఖరిదైన మూడో వన్డే కూడా హర్మన్‌ప్రీత్ సేనదే. ఫలితంగా వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. శుక్రవారం వడోదర వేదికగా జరిగిన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 38.5 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. లక్ష్యాన్ని టీమిండియా 28.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలువగా..పేసర్ రేణుక సింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సాధించింది.
మూడో వన్డేలో దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మొదట బంతితో చెలరేగిన ఆమె 6 వికెట్లు పడగొట్టి కరేబియన్ జట్టు పతనాన్ని శాసించింది. ఆమెకుతోడు పేసర్ రేణుక సింగ్ కూడా 4 వికెట్లతో రెచ్చిపోయింది. మొదట విండీస్ పతనాన్ని మొదలుపెట్టింది రేణుకనే. తొలి ఓవర్‌లోనే కియానా జోసెఫ్(0), కెప్టెన్ హేలీ మాథ్యూస్(0)లను డకౌట్ చేసింది. ఆ తర్వాత ఆమెకు దీప్తి తోడవడంతో వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడల్లా కూలిపోయింది. చినెల్లె హెన్రీ(61), కాంప్‌బెల్లె(46) మాత్రమే పోరాడగా.. మిగతా వారు తేలిపోయారు. ఇద్దరు డకౌటవ్వగా.. ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో కష్టంగా 150 పరుగుల మార్క్‌ను దాటింది. బంతితో మెరిసిన దీప్తి(39 నాటౌట్) బ్యాటుతోనూ కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఛేదన ఆరంభంలో భారత్ తడబడింది. స్మృతి మంధాన(4), ప్రాతిక రావల్(18), హర్లీన్ డియోల్(1) వికెట్లను త్వరగానే కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్(32), రోడ్రిగ్స్(29) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టి జట్టులో జోష్ నింపారు. వారి తర్వాత దీప్తి శర్మ జట్టు బాధ్యతను మీదేసుకుంది. ఆచితూచి ఆడింది. మరో ఎండ్‌లో రిచా ఘోష్(23) సిక్స్‌లు బాదింది. ఈ క్రమంలోనే ఈ జంట 28.2 ఓవర్లలో జట్టును విజయతీరాలకు చేర్చింది.
సంక్షిప్త స్కోరుబోర్డు
వెస్టిండీస్ మహిళల ఇన్నింగ్స్ : 162 ఆలౌట్(38.5 ఓవర్లు)
(చినెల్లె హెన్రీ 61, కాంప్‌బెల్లె 46, దీప్తి శర్మ 6/31, రేణుక సింగ్ 4/29)
భారత మహిళల ఇన్నింగ్స్ : 167/5(28.2 ఓవర్లు)
(దీప్తి శర్మ 39 నాటౌట్, హర్మన్‌ప్రీత్ కౌర్ 32, రోడ్రిగ్స్ 29, రిచా ఘోష్ 23 నాటౌట్)