- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వింటాకు ఏడు కేజీల తరుగు…ఒప్పుకుంటేనే ధాన్యం కొంటాం..
దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం రైతులు ఆందోళన చేపట్టారు. బస్టాకు 3 కిలోల చొప్పున కింటాల్ కి 7 కిలోల చొప్పున తరుగు తీస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని గత కొన్ని రోజుల కిందట మార్కెట్ లో ఆరబోశారు. రాత్రనకా, పగలనకా ధాన్యాన్ని కాపాడుకుంటూ చలిలో తీవ్ర వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఇంత కష్టపడి ధాన్యం మార్కెట్ కి తీసుకు వస్తే కుంటి సాకులు చెబుతూ ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తాలు, డస్ట్ ఉందంటూ బస్తాకు మూడు కేజీలు అదనంగా కాంట పెట్టేందుకు రైతులు ఒప్పుకుంటేనే ధాన్యం కొనుగోళ్లు చేపడతామని సెంటర్ నిర్వాహకులు బహిరంగంగా చెప్పడం గమనార్హం. కాగా మిల్లర్ల ఆదేశాల మేరకే రైతులకు చెబుతున్నట్లు పేర్కొనడం కొసమెరుపు.
బోనస్ కోసం అన్నదాతల ఆశ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరపై బోనస్ రూ.500 అందజేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పడిన కష్టానికి లాభం వస్తుందని ఆశిస్తున్నా రైతన్నలు పెద్ద ఎత్తున వ్యవసాయ మార్కెట్ కి ధాన్యాన్ని తరలిస్తున్నారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి ఒప్పుకోనట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆశయం కాస్త అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల అత్యాశతో నీరుగారిపోతోంది. ఎంతో కొంత లబ్ధి జరుగుతుందని మార్కెట్ కి వచ్చిన రైతన్నలకు ప్రైవేట్ కి అమ్ముకుంటేనే బాగుండు అనేలా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు కారణమవుతున్నది. డస్ట్ పేరుతో రైతులను ఇబ్బందుల పాలు చేయకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని కోరుతున్నారు.