Kitchen Tips: కిచెన్‌లో నూనె మరకలను ఈ సింపుల్ చిట్కాలతో తొలగించుకోండి!

by Kanadam.Hamsa lekha |
Kitchen Tips: కిచెన్‌లో నూనె మరకలను ఈ సింపుల్ చిట్కాలతో తొలగించుకోండి!
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా ప్రతి ఒక్కరూ ఎంత జాగ్రత్తగా వంట చేసినా కొన్ని సందర్భాల్లో నూనె, మసాలా దినుసులు వంటివి ఒలికి పోవడం జరుగుతుంటాయి. మిగితా వాటి కంటే ఎక్కువగా నూనె మరకలు పడితే వాటిని తొలగించడం కష్టమవుతుంది. ఎందుకంటే నూనె వల్ల కిచెన్ స్లాబ్ జిడ్డుగా మారుతుంది. చాలామంది వీటిని తొలగించడం కష్టమని భావిస్తారు. దీనికి రకరకాల కిచెన్ టిప్స్‌ని ఫాలో అవుతుంటారు. అయినా సరే కొన్నిసార్లు ఈ మరకలు అలాగే ఉండిపోతాయి. ఆ మొండి మరకలను ఈజీగా తొలగించడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.. చదివేయండి.

* కిచెన్‌లో పొరపాటున నూనె ఒలికిపోతే వెంటనే దానిపై గోధుమ పిండి చల్లాలి. కొంతసేపటి తరువాత పేపర్‌తో తుడిస్తే నూనె పడిన ప్రాంతం జిడ్డుగా లేకుండా ఉంటుంది.

* అలాగే కిచెన్ వాల్ మరకలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు తీసుకుని అందులో టీస్పూన్ బేకింగ్ సోడా, కొంచెం నిమ్మరసం కలపాలి. ఇప్పుడు స్ప్రే బాటిలో ఈ వాటర్‌ని పోసి, కిచెన్ వాల్‌పై స్ప్రే చేసి, శుభ్రంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల మొండి మరకలు తొలగిపోతాయి.

* వంటగదిలోని మరకలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, వెనిగర్ రెండూ బాగా ఉపయోగపడతాయి. నూనె మరకలు పడిన వెంటనే గోరు వెచ్చని నీటిలో ఈ రెండిటిని కలిపి తుడిస్తే అవి జిడ్డుగా మారవు.

* అలాగే టూత్‌పేస్ట్‌ కూడా ఈ మరకలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. టూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేస్ట్‌ని ఆయిల్ స్టెయిన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, కొంత సమయం తరువాత కడిగేస్తే ఈ మరకలు ఈజీగా పోతాయి.

* డిటర్జెంట్ కూడా స్టవ్ లేదా ఫ్లోర్ మీద పడిన నూనె మరకలను ఈజీగా తొలగిస్తుంది. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ మిక్స్ చేయాలి. తరువాత నూనె మరకలు ఉన్న ప్రాంతంలో క్లాత్‌తో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల మరకలను ఈజీగా శుభ్రం చేయవచ్చు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.

Advertisement

Next Story

Most Viewed