- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ ట్వీట్
X
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ(Delhi) పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మరోసారి విమర్శలు చేశారు. మీరు దేనికి ఢిల్లీకి వెళ్తున్నారో గాని ఇప్పటి వరకు 28 సార్లు ఢిల్లీకి వెళ్ళి 28 రూపాయలు కూడా రాష్ట్రానికి తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. సీఎం పర్యటనలపై ప్రశ్నించడం పౌరులుగా మా బాధ్యత అన్నారు. గడిచిన ఏడాది కాలంలో రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు తప్ప, అదనంగా ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి తీసుకు రాలేదని మండి పడ్డారు. ఈడీ దాడులు తప్పించుకోడానికి ఫైవ్ స్టార్ హోటల్లో ఎవరి కాళ్ళు పట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఎన్నడూ ఢిల్లీకి గులాములము కాదని, పోరాటం తెలంగాణ రక్తంలోనే ఉందని తెలియజేశారు. మా ఎజెండా, జెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధి మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Advertisement
Next Story