Sambhal Violence: సంభాల్ హింస కేసులో సమాజ్ వాదీ పార్టీ ఎంపీపై అభియోగాలు

by Shamantha N |
Sambhal Violence: సంభాల్ హింస కేసులో సమాజ్ వాదీ పార్టీ ఎంపీపై అభియోగాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) సంభాల్‌(Sambhal Violence)లో చెలరేగిన హింసాత్మక ఘటనపై అధికారులు చర్యలకు పూనుకున్నారు. దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 400 మందిపై ఏడు కేసులు నమోదు చేశారు. అయితే, కేసు నమోదైన వారిలో ఎంపీతో సహా ఎమ్మెల్యే కుమారుడు ఉండటం గమనార్హం. సంభాల్‌ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత(Samajwadi Party MP ) జియావుర్‌ రెహమాన్‌ బర్క్(Ziaur Rahman Barq), ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్‌ మెహమూద్‌ కుమారుడు సోహైల్‌ ఇక్బాల్‌ పై కేసులు నమోదయ్యాయి. వీరు హింసకు పాల్పడటంతోపాటు జనాలను రెచ్చగొట్టారని అభియోగాలు మోపారు.

చెలరేగిన హింస

కాగా సంభాల్‌ పట్టణంలో మొగల్‌ కాలానికి చెందిన షాహీ జామా మసీదు ఉన్న చోట హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదు అందింది. దీంతో న్యాయస్థానం మసీదులో సర్వేకి ఆదేశించింది. దీంతో, ఆదివారం సర్వే నిర్వహిస్తుండగా హింస చేలరేగింది. గుంపుగా వచ్చిన కొందరు స్థానికులు సర్వేకు వ్యతిరేంగా మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో నలుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. అల్లర్లలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఈ ఘటనపై అధికార బీజేపీ, ప్రతిపక్ష ఇండియా కూటమి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఆరోపించగా.. హింసను హస్తం పార్టీయే ప్రేరేపిస్తోందని పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇక, ఈ ఘటన తర్వాత జిల్లాలో 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో పాటు ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు. అలాగే నవంబర్ 30 వరకు బయటి వ్యక్తులు జిల్లాలోకి రాకుండా జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది.

Advertisement

Next Story

Most Viewed