Secularism: సెక్యులరిజం భారత్‌లో అవసరం లేదు.. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి

by vinod kumar |   ( Updated:2024-09-23 12:42:53.0  )
Secularism: సెక్యులరిజం భారత్‌లో అవసరం లేదు.. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి
X

దిశ, నేషనల్ బ్యూరో: సెక్యులరిజం అనేది యురోపియన్ కాన్సెప్ట్ అని.. భారత్‌లో దాని అవసరం లేదని తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి అన్నారు. తాజాగా కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలకు వ్యతిరేకంగా అనేక మోసాలు జరిగాయని వాటిలో ఒకటి సెక్యులరిజానికి తప్పుడు వివరణ అని తెలిపారు. ‘సెక్యులరిజం అనేది యూరోపియన్ భావన. చర్చి, రాజుకు మధ్య జరిగిన పోరాటం వల్ల అది ఉద్భవించింది. కానీ భారత్ ధర్మానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ వైరుధ్యాలు ఉండవు. కాబట్టి సెక్యులరిజాన్ని ఐరోపాలోనే ఉండనివ్వండి. భారతదేశంలో దాని అవసరం ఏ మాత్రం లేదు’ అని తెలిపారు.1976లో రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం అనే పదాన్ని ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీపైనా రవి విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ కాలంలో, అభద్రతా భావంతో ఉన్న ప్రధాని కొన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టేందుకే రాజ్యాంగంలో లౌకికవాదాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed