బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం.. రెండో టెస్టు ఆడటం డౌటే

by Harish |   ( Updated:2024-09-23 12:11:30.0  )
బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం.. రెండో టెస్టు ఆడటం డౌటే
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా చేతిలో తొలి టెస్టు కోల్పోయిన బాధలో ఉన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్ తగిలేలా కనిపిస్తున్నది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. చెన్నయ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా బౌలింగ్‌లో షకీబ్ కుడి చేతి వేలికి గాయమైంది. మ్యాచ్‌లో అతను వేలికి పట్టి కట్టుకుని కనిపించాడు.

గాయం కారణంగా తన పూర్తి సామర్థ్యంతో బౌలింగ్ చేయలేకపోయాడు. ప్రస్తుతం అతను అబ్జర్వేషన్‌లో ఉన్నాడు. అతని విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమని బంగ్లా సెలెక్టర్ హన్నన్ సర్కార్ తెలిపారు. ‘ప్రస్తుతం అతను ఫిజియో అబ్జర్వేషన్‌లో ఉన్నాడు. ఫిజియో అభిప్రాయం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకుంటాం. మ్యాచ్‌ నాటికి అతని పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలి. మ్యాచ్‌కు ఇంకా సమయం ఉంది. షకీబ్‌ ఎంపికపై ఆలోచించాలి.’ అని చెప్పారు. కాగా, ఈ నెల 27 నుంచి అక్టోబర్ 1 వరకు కాన్పూర్ వేదికగా చివరిదైన రెండో టెస్టు జరగనుంది.

Advertisement

Next Story