- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతి కల్తీ నెయ్యి వివాదం.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ అంశంపై సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ స్పందిస్తున్నారు. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో టీటీడీ(TTD) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం చేసేందుకు రెడీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలయానికి చేరుకున్న భూమన.. కాసేపట్లో ప్రమాణం చేయనున్నారు.
ఈ సందర్భంగా అక్కడ భూమన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరుగలేదని.. స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూలు తయారు చేయించామని అన్నారు. వందరోజులైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదని.. పైగా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. పుష్కరిణిలో స్నానం చేసి.. మహాద్వారం వద్ద మొక్కి.. అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి ప్రమాణం చేయబోతున్నట్లు కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.