డిసెంబర్ 9 తర్వాత రైతు భరోసా ఇస్తాం.. మంత్రి పొన్నం

by Sumithra |
డిసెంబర్ 9 తర్వాత రైతు భరోసా ఇస్తాం.. మంత్రి పొన్నం
X

దిశ, హుజురాబాద్ : రైతు భరోసా పై మంత్రుల సబ్ కమిటీ నివేదిక సమర్పిస్తుందని, డిసెంబర్ 9 న రైతు భరోసా పై చర్చించి త్వరలో ఇస్తారని, ఇందులో ఎలాంటి అపోహలు అవసరం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుజురాబాద్ లో నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరయ్యారు. మంత్రితో వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో రైతులకు సంక్షేమ కర్యక్రమాలు కేవలం కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగాయని, కాళేశ్వరంలో చుక్క నీరు వాడకున్నా అత్యధిక పంట తీశాం అని అన్నారు. కొనుగోలు కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేశాం అని అన్నారు. మిల్లర్లతో మిలాకత్ అయి బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూశారని, ప్రభుత్వం నిటారుగా నిలబడి మిల్లర్ల పై ఒత్తిడి తెస్తెనే రైతులకు ఈ రోజు న్యాయం జరిగిందని అన్నారు.

ఇప్పటికీ మిల్లర్లు ప్రభుత్వానికి 20 వేల కోట్ల బకాయిలు ఉన్నారని అన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నాం అని, సన్న వడ్లకు బోనస్ రాకపోతే డబల్ పెనాల్టీతో చెల్లిస్తాం అని అన్నారు. గతంలో రైతు రుణ మాఫీ నాలుగు విడతలుగా చేశారని, నేడు మేము ఓకె విడతలో చేశాం అని, కేవలం టెక్నికల్ ప్రాబ్లం వల్లనే కొందరికి ఆగిపోయిందనీ, నేటికీ రెండు లక్షలకు పైగా బకాయి ఉన్న వారికి సైతం మాఫీ చేస్తున్నాం అని అన్నారు. రైతు భరోసా విషయంలో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారని, రైతు భరోసా తప్పక ఇస్తామని అన్నారు. రైతు బందు గతంలో రియల్ ఎస్టేట్ చేసే వారు, గుట్టలు పట్టాగ ఉన్న వారు సేద్యం చేయకుండా పొందారని, ఈ విషయం పై సబ్ కమిటీ వేశామని, నివేదిక రాగానే 9న చర్చ పెట్టి తొందరలో రైతు భరోసా ఇస్తాం అని అన్నారు.

గతంలో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ గా ఏర్పడి మహారాష్ట్ర లో పోటీ చేస్తాం అని ఆర్భాటాలు పలికి ఈ రోజు ఒక్క సీట్ కు పోటీ చేయకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నారని అన్నారు. ఇలాంటి వారు కాంగ్రెస్ ఓడిపోతే సంబరాలు చేసుకుంటున్నారు అని, మీ సంతోషం కాంగ్రెస్ ఒడిపోయినందుకా.. బీజేపీ గెలుచినందుకా.. తెలపాలని అన్నారు. మీరు బీజేపీ పార్టీకి బి టీమ్.. కాదా అని ఆయన ప్రశ్నించారు. ఆడవాళ్ళకు ఫ్రీ బస్ పెడితే వాళ్ళు ఉల్లిపాయలు తీసుకోవడానికి వెళుతున్నారని వారిని అవమానపరిచారని అన్నారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్. 500 కే గ్యాస్ పథకం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, ప్రస్తుతం నియోజకవర్గానికి 3500 ఇండ్లు, త్వరలో రేషన్ కార్డులు ఇస్తున్నాం అని, కుల సర్వే లో వివరాలు నమోదు అయ్యాక ఇప్పుడు ఉన్న పథకాలు కాకుండా కొత్త పథకాలు వస్తాయి అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed