- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజావాణికి హాజరుకాని అధికారులు
దిశ,తాడ్వాయి: ప్రజల నుంచి అర్జీలను స్వికరించి సమస్యలను పరీక్షించేందుకు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో అర్జీలు తీసుకునే అధికారులే కరువయ్యారు. ప్రజావాణిలో అర్జీదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్దాం అన్న పలు శాఖల అధికారులు హజరుకాకపోవడంతో..అర్జీదారులు నిరుత్సాహంగా వేను తిరిగి వెళ్తున్నారు. మండలంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి రెవెన్యూ,ఎంపీడీవో,ఐసిడిసిఎస్, మిషన్ భగీరథ,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యాశాఖ,వ్యవసాయశాఖల అధికారులు ప్రజావాణిలో హాజరయ్యారు. సత్వర సమస్యలు పరిష్కరించాల్సిన పలు శాఖల అధికారులు హజరుకాకపోవడంతో.. కుర్చీలు బోసిపోయాయి. ఇదే విషయమై ఎమ్మార్వో రహీముద్దీన్ ను వివరణ కోరగా..ప్రజావాణికి గైర్హాజరి అయిన సంబంధిత శాఖ అధికారులపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.
హాజరుకాని అధికారులు.. తీరని సమస్యలు
మండలంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు గైర్హాజరు కావడం పరిపాటిగా మారింది. ఆయా గ్రామాల నుంచి వచ్చే ప్రజలు.. తమ సమస్యలను అధికారులకు విన్నవించుకుంటారు. ప్రజావాణి కార్యక్రమానికి పలుశాఖల అధికారులు హాజరుకావడం లేదు. దీంతో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి నెలకొంటున్నదని ప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు.