విద్యార్థిని శైలజ మృతి.. ఆశ్రమ పాఠశాలలో విషాదఛాయలు..

by Sumithra |
విద్యార్థిని శైలజ మృతి.. ఆశ్రమ పాఠశాలలో విషాదఛాయలు..
X

దిశ, వాంకిడి : ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వాంకిడి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని చౌదరి శైలజ సోమవారం మృతి చెందింది. గత నెల 30న వాంకిడి ఆశ్రమపాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు. అందులో శైలజతో పాటు మహాలక్ష్మి, జ్యోతికల పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స అందించిన ఆరోగ్యం అదుపులోకి రాకపోవడంతో హైదరాబాద్ నిమ్స్ తరలించారు. మహాలక్ష్మి, జ్యోతికల ఆరోగ్యం కుదుట పడి వారిద్దరు డిశ్చార్జ్ కాగా శైలజ మాత్రం గత (25) రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతూ సోమవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచింది. శైలజ మృతితో సంగ్రామైన దాబాలో పాటు ఆశ్రమ పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగింది.

ఇది ప్రభుత్వ హత్యనే..

శైలజ మృతి ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దిన్ కార్ ఆరోపించారు. దీనికి బాధ్యులైన అధికారులందరి పై వెంటనే హత్యానేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియో, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story