Ponnam Prabhakar: రైతుభరోసాపై అప్‌డేట్ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-25 09:22:49.0  )
Ponnam Prabhakar: రైతుభరోసాపై అప్‌డేట్ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతుభరోసా(Rythu Bharosa)పై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అతి త్వరలో రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో దోస్తీ చేస్తూ.. గల్లీలో కుస్తీలా ఆ రెండు పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కులగణన(Caste Census) ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. దీంతో దేశంలోనే అతిపెద్ద మార్పునకు శ్రీకారం చుట్టామని అన్నారు.

మరోవైపు రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంది. పూర్తి చేసిన ఫారాల డేటా ఎంట్రీ చురుగ్గా సాగుతోంది. సర్వే చివరి దశకు చేరిన తరుణంలో వాటిని వెంట వెంటనే డేటా ఎంట్రీ చేయడం ద్వారా ప్రభుత్వం అనుకున్న సమయంలో లెక్కలు, వివరాలు తెలుసుకోవడానికి అనుగుణంగా పనులు స్పీడప్ చేసింది. సర్వే ఒక ఎత్తు అయితే కంప్యూటరీకరించడం మరొక ఎత్తు. ఈ నేపథ్యంలో డేటా ఎంట్రీపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు, సలహాలు ఇచ్చారు. డేటా ఎంట్రీకి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా డేటా ఎంట్రీని ఇప్పటికే ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed