ప్రారంభమైన బేతంపూడి దర్గా ఉర్సు

by Sridhar Babu |
ప్రారంభమైన బేతంపూడి దర్గా ఉర్సు
X

దిశ,టేకులపల్లి : ప్రసిద్ధి చెందిన బేతంపూడి హజరత్ సయ్యద్ జమాలుద్దీన్ బీహర్ బాబా షరీఫ్ ఉర్సు సాంప్రదాయ బద్ధంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరంలాగే గంథం కొత్తగూడెం మాలిక్ పాన్ షాప్ సూపర్ బజార్ నుంచి సాయంత్రం ర్యాలీగా బేతంపూడి స్టేజీ మీదుగా దర్గాకు చేరుకుంది. దాంతో ఉర్సు వేడుకలు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్, బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్రావు, మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్యక్ష, కార్యదర్శులు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్, బోడ బాలునాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేతంపూడి దర్గా ఉర్సు ఉత్సవాలు కులమతలకు అతీతంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్సవాల్లో బాబా దీవెనలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఉర్సు ఉత్సవాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచేకాక రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed