- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పని భారంలో తల్లాడుతున్న పంచాయతీ కార్యదర్శులు..
దిశ, ఆలూర్ : ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హుల ఎంపిక ప్రభుత్వ సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఖాళీ జాగాలు, గుడిసెలు, పెంకుటిల్లు ఉన్నోళ్లే కాకుండా కాంక్రీట్ బిల్డింగులతో పక్కా ఇండ్లు ఉన్నోళ్లు సైతం ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పక్కా ఇండ్లు ఉన్నప్పటికీ ఎందుకు అప్లై చేసుకున్నారని సిబ్బంది అడిగితే.. సర్కార్ డబ్బులు ఇస్తే, కూల్చి కొత్తది కట్టుకుంటామని చెబుతున్నారు. అదే విధంగా సరైన ఇంటి పత్రాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాగైతే సర్వే సంక్రాంతి లోపు పూర్తి కావడం కష్టమేనని అంటున్నారు.
నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా 3.2 లక్షలు దరఖాస్తులు జరుగుతున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 33 లక్షలకు పైగా అప్లికేషన్లను వెరిఫై చేయగా, అందులో 2 లక్షలకు పైగా పక్కా ఇండ్లు ఉన్నవేనని తేలింది. అదే విధంగా 4.5 లక్షల మంది రేకుల ఇండ్లలో, పెంకుటిండ్లలో ఉంటున్నట్టు గుర్తించారు. అయితే మొదటి దశలో జాగా ఉండి ఇల్లు లేని వారికి, పూరిగుడిసెల్లో, శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లో ఉంటున్న వారికి ఆర్థిక సాయం అందజేస్తామని సర్కార్ ప్రకటించింది.
వెరిఫికేషన్ కు మొబైల్ యాప్..
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొదటి దశలో సొంతంగా ఇంటి జాగా ఉన్న 4.50 లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇంటి నిర్మాణం కోసం వివిధ దశల్లో కలిపి రూ.5 లక్షలు ప్రభుత్వం సాయం కింద అందించనుంది. అర్హులను గుర్తించేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) సహకారంతో 'ఇందిరమ్మ ఇండ్ల ఇన్‌స్పెక్షన్ మొబైల్ యాప్' రెడీ చేసింది. సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఫీల్డ్‌లో సర్వే నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో గత 15 రోజులుగా సిబ్బంది మున్సిపాలిటీలు, గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో 20, 30 టీమ్ ల చొప్పున తిరుగుతుండగా.. గ్రామాల్లో రెండు నుంచి మూడు టీమ్ లు సర్వేలో పాల్గొంటున్నాయి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, వీవోఏలు, అంగన్‌వాడీ టీచర్లకు సర్వే బాధ్యతలను అప్పగించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలకు పైగా అప్లికేషన్లను వెరిఫై చేశారు.
ఆలస్యమవుతున్న సర్వే..
ఒక్కో దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి, ఫొటోలు తీసి వివరాలన్నీ అప్‌లోడ్ చేయడానికి సిబ్బందికి కనీసం 30 నిమిషాలకు పైగా సమయం పడుతున్నది. ఒక్క టీమ్ ఒక్క రోజులో 15 నుంచి 20 దరఖాస్తులకు మించి చేయడం లేదు. మొబైల్ యాప్‌లో నాలుగు పేజీలు ఉన్నాయి. ప్రతి పేజీ నింపి ఇల్లు, ఇంటి జాగా ఫొటో, ఇంటి స్థలం పేపర్లు, ఇంటి పన్నుల రసీదులు అప్‌లోడ్ చేస్తున్నారు. అద్దెకు ఉండేవాళ్లు, వికలాంగులు, తల్లి, తండ్రి లేకుండా ఒంటరిగా జీవించేవాళ్లు, సింగిల్ ఉమెన్, ట్రాన్స్‌జెండర్లు, సఫాయి కర్మాచారిలు, రోడ్డు వెడల్పులో, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇండ్లు కోల్పోయిన వాళ్ల వివరాలను ప్రత్యేకంగా పేర్కొంటున్నారు.
దరఖాస్తు దారుల్లో గందరగోళం...
*ప్రజాపాలన దరఖాస్తు సమయంలో ఇంటి కోసం నమోదు చేసుకున్నా... యాప్‌లో వివరాలు చూపించడంలేదు. దరఖాస్తులు కంప్యూటీకరణ చేసిన సమయంలో కొందరివి సరైన విధంగా నమోదు చేయకపోవడమే సమస్యగా మారింది.
*యాప్‌లో ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం, ఇల్లు కావాలనే.. రెండు రకాలుగా చూపిస్తోంది. మొదట దేనికి ప్రాధాన్యం ఇస్తారో తెలియకపోగా, ప్రభుత్వం మాత్రం ముందుగా స్థలమున్న వారికే ఆర్థిక సాయం అందిస్తామని చెబుతోంది. అంటే ఇల్లు కావాలనే వారి వివరాలను కూడా ముందుగానే తీసుకుంటుంది.
*అద్దె ఇళ్లలో ఉన్న వారు ఇల్లు మార్చితే సర్వే సిబ్బంది సమాచారం ఇవ్వడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. పనులకు వెళ్లిన సమయంలో ఉద్యోగులు రావడం, దరఖాస్తుదారుల అనుకూల సమయంలో రావాలని కోరుతున్నా సర్వే సిబ్బందిలో కొందరు దురుసుగా వ్యవహరిస్తున్నారు.
*నగర పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఎక్కడ చేస్తున్నారో తెలియకుండా మారింది. ఏ వీధిలో ఉంటారనే విషయాన్ని ముందుగా సమాచారం ఇవ్వడం లేదు.
దరఖాస్తుల పరిశీలన... ఎంపీడీవో సాయిరాం...
ఆర్మూర్ మండల పరిధిలోని 18 గ్రామాలలో మొత్తం 10,373 దరఖాస్తులు వచ్చాయి. అయినా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఇంటికి వెళ్లి మొబైల్ యాప్ ల ద్వారా పకడ్బందీగా సర్వే చేస్తున్నాం. ఇప్పటి వరకు 5480 ఇండ్ల సర్వే పూర్తి చేసినం. ఇందులో పక్కా ఇల్లు ఉన్నవారు కూడా ఉన్నారు.