- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SA Vs PAK : కొర్బిన్ బాస్చ్ సంచలనం.. 122 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన సౌతాఫ్రికా బౌలర్
దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా బౌలర్ కొర్బిన్ బాస్చ్ సంచలనం సృష్టించాడు. పాకిస్తాన్‌తో సెంచూరీయన్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు తొమ్మిదో వికెట్‌కు బ్యాటింగ్‌కు దిగి 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అరంగేట్ర టెస్ట్‌లో సౌతాఫ్రికా తరఫున 8వ వికెట్ తర్వాత బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. దీంతో 122 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు. ఆడిన తొలి టెస్ట్‌లోనే నాలుగు వికెట్లు తీసి హాఫ్ సెంచరీ చేసిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలిచాడు. దీంతో పాటు తొలి టెస్ట్‌లో 9వ వికెట్ కు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు.
సౌతాఫ్రికా 301 ఆలౌట్
పాకిస్తాన్-సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు బాస్చ్ వీరోచిత పోరాటంతో సౌతాఫ్రికా 90 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 211పరుగులకు ఆలౌట్ అయింది. మార్క్‌రమ్(89), కొర్బిన్ బాస్చ్(81) రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రుమ్ షెహజాద్, నసీమ్ షా చెరో మూడు వికెట్లు పడగొట్టారు.రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 88 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.