- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాలివీడు ఘటనపై పోలీసుల యాక్షన్ షురూ... 13 మందిపై కేసు నమోదు
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా గాలివీడు(Annamaya district Galiveedu)లో వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి(YCP Legal Cell President Sudarshan Reddy), ఆయన అనుచరులు రెచ్చిపోయారు. గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు(Galiveedu MPDO Jawahar Babu)పై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ(Galiveedu MPP Padmavathamma) కుమారుడే సుదర్శన్ రెడ్డి. తన అనుచరులతో కలిసి ఎంపీపీ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఎంపీపీ చాంబర్ తాళం ఇవ్వాలని అడిగారు. అయితే ఇందుకు ఎంపీడీవో జవహర్ బాబు నిరాకరించారు. ఎంపీపీకి మాత్రమే తాళం ఇవ్వాలని, ఇతరులకు ఇవ్వకూడదని చెప్పడంతో ఒక్కసారిగా సుదర్శన్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. తన 20 మంది అనుచరులతో జవహర్ బాబుపై దాడి చేశారు. కుర్చీలో ఉన్న జవహర్ బాబు కిందపడినా కనికరించలేదు. కాళ్లతో తన్నుతూ, బూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఎంపీడీవో జవహర్ బాబు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రాయచోటి పోలీసులకు ఎంపీడీవో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు యాక్షన్ షురూ చేశారు. కీలక నిందితుడు సుదర్శన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఎస్పీ కార్యాలయానికి తరలించారు. సీసీ ఫుటేజ్ ద్వారా ఈ దాడిలో మొత్తం 13 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. అందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.